అయోధ్య వేడుక .... ప్రయాణికులకు స్పైస్‌జెట్ అదిరిపోయే ఆఫర్
- కనిష్ఠంగా రూ.1,622 నుంచే టిక్కెట్ ధరలను ప్రారంభిస్తున్న స్పైస్‌జెట్
- దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు వర్తిస్తుందని వెల్లడి
- స్పైస్ మ్యాక్స్, యూఫస్ట్ వంటి యాడ్-ఆన్‌లు సహా సీట్ల ఎంపిక ఛార్జీలపై 30 శాతం అదనపు రాయితీ
జనవరి 22 నుంచి 28 మధ్య బుక్ చేసుకునే టిక్కెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ సేల్ సందర్భంగా టిక్కెట్‌ను బుక్ చేసుకున్న వారు విమానం బయలుదేరడానికి 96 గంటల ముందు వరకు ప్రయాణ తేదీని ఉచితంగానే మార్చుకునే వెసులుబాటును కూడా కల్పిస్తోంది. ఏ మాధ్యమం ద్వారా బుక్ చేసుకున్నా టిక్కెట్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ముంబై - గోవా, ఢిల్లీ-జైపూర్, గౌహతి-బాగ్‌డోగ్రా వంటి ప్రముఖ మార్గాలలో కనిష్ఠ ధర రూ.1,622 వర్తిస్తుందని తెలిపింది.