అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూర్తి.. స్వామివారి సుందర రూపాన్ని వీక్షించండి!
- అయోధ్యలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం
- మధ్యాహ్నం 12.29 గంటలకు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
- 84 సెకన్ల పాటు కొనసాగిన ప్రాణ ప్రతిష్ఠ క్రతువు
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే రామజన్మభూమిపై హెలికాప్టర్లతో పూలను చల్లారు. మరోవైపు, రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా టీవీల ద్వారా వీక్షించారు. ఒక అద్భుతమైన, అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించిన ప్రజలంతా ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. ప్రసన్న వదనం, చిరు దరహాసం, స్వర్ణాభరణాలతో, ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాల రాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఈరోజు యావత్ దేశం రామ నామ స్మరణతో మారుమోగింది.




