రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోదీ.. పూజ ప్రారంభం.. వీడియో ఇదిగో!
- అయోధ్య ఆలయానికి చేరుకున్న మోదీ
- పూజలో కూర్చున్న ప్రధాని, ఆరెస్సెస్ చీఫ్ భగవత్
- మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం కానుంది. రామ మందిరం మొత్తం అత్యంత సుందరంగా ముస్తాబయింది. వేడుకకు 7 వేలకు పైగా వీవీఐపీలు హాజరయ్యారు. అంతకు ముందు రామ మందిరంపై హెలికాప్టర్ ద్వారా పూలను చల్లారు. ప్రముఖ గాయకులు రాముడిని కీర్తిస్తూ పాటలు పాడారు.