Narendra Modi: రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోదీ.. పూజ ప్రారంభం.. వీడియో ఇదిగో!

  • అయోధ్య ఆలయానికి చేరుకున్న మోదీ
  • పూజలో కూర్చున్న ప్రధాని, ఆరెస్సెస్ చీఫ్ భగవత్
  • మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
Modi sat in pooja in Ayodhya Ram Mandir

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న శుభ ఘడియలు ఆసన్నమయ్యాయి. కాసేపట్లో అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరానికి చేరుకున్నారు. బాల రాముడికి ఆయన పట్టు వస్త్రాలు, పాదుకలు, తలంబ్రాలు, ఛత్రాన్ని తీసుకొచ్చారు. వాటిని ఆలయ ప్రధాన అర్చకులు స్వీకరించారు. మోదీ ప్రస్తుతం పూజా కార్యక్రమంలో కూర్చున్నారు. ఆయనకు తిలకం దిద్దిన అర్చకులు పూజను ప్రారంభించారు. పూజలో మోదీ పక్కన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. 

మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం కానుంది. రామ మందిరం మొత్తం అత్యంత సుందరంగా ముస్తాబయింది. వేడుకకు 7 వేలకు పైగా వీవీఐపీలు హాజరయ్యారు. అంతకు ముందు రామ మందిరంపై హెలికాప్టర్ ద్వారా పూలను చల్లారు. ప్రముఖ గాయకులు రాముడిని కీర్తిస్తూ పాటలు పాడారు. 

More Telugu News