తడబడి కిందపడబోయిన తమిళనాడు సీఎం స్టాలిన్.. చెయ్యి పట్టుకుని నడిపించిన ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో!
- ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేదికపై ఘటన
- స్టాలిన్ ఎడమచేయి పట్టుకుని కిందపడకుండా పట్టుకున్న మోదీ
- ఆపై ఇద్దరూ కలిసి స్టేజిపైకి
ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ.. 2036 ఒలింపిక్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. క్రీడాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు, దేశాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ ఎకోసిస్టంకు కేంద్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడును క్రీడలకు దేశ రాజధానిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.