Ayodhya Live: అయోధ్య వేడుకలు దేశంలోని పలు థియేటర్లలో లైవ్.. పాప్ కార్న్ ఫ్రీ

Ram Mandir Inauguration Live Stream
షార్ట్స్‌లో చూడండి
అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 22న నిర్వహించే ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా వీక్షించాలని ప్రతీ రామ భక్తుడూ కోరుకుంటున్నాడు. అయితే, ఆంక్షల కారణంగా అయోధ్యకు వెళ్లడం అందరికీ సాధ్యం కావడంలేదు. ఈ క్రమంలో అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ క్రతువును టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికి అదనంగా దేశవ్యాప్తంగా ఉన్న పలు థియేటర్లలోనూ ఈ వేడుకలను లైవ్ ప్రసారం చేయనున్నాయి.

ప్రముఖ థియేటర్లు పీవీఆర్, ఐనాక్స్ లు మొత్తం 100 స్క్రీన్లపై ఈ లైవ్ ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. రూ.100 టికెట్ తో ప్రేక్షకులను లోపలికి అనుమతించనున్నట్లు వెల్లడించాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లైవ్ కొనసాగనుందని, థియేటర్లకు వచ్చిన భక్తులకు పాప్ కార్న్, కూల్ డ్రింక్ ను ఉచితంగా అందిస్తామని పీవీఆర్, ఐనాక్స్ నిర్వాహకులు తెలిపారు.

రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఓ చారిత్రక ఘట్టమని పీవీఆర్ ఐనాక్స్ కో-సీఈవో గౌతమ్ దత్తా పేర్కొన్నారు. అందుకే ఈ వేడుకను పెద్ద తెరపై చూసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ నెల 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అయోధ్య వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేసేలా పీవీఆర్‌, ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి. దేశంలోని 70 నగరాలలో 170 కేంద్రాలలోని 100 స్క్రీన్లపై ఈ ప్రసారాలు చేపట్టనున్నట్లు తెలిపాయి. పెద్ద స్క్రీన్లపై ఈ వేడుకలను చూసేందుకు ఆయా మల్టీప్లెక్స్ ల అధికారిక వెబ్ సైట్ లలో, బుక్ మై షో ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
Go Back to Shorts
Ayodhya Live
Big screens
Pvr Inox
Ram mandir
Live in Theaters
Popcorn Free

More Telugu News