Hero Shivaji: నేను రాజకీయాలకు సెట్‌ కాను.. హీరో శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

Hero Shivaji made interesting comments about his Political Entry
  • తనలాంటి వారు రాజకీయాలకు పనికి రారని వ్యాఖ్యానించిన శివాజీ
  • ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసమే గతంలో తాను పోరాటం చేశానని ప్రస్తావన
  • ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వారి గొంతుకగా ఉంటానన్న హీరో
‘నైన్టీస్: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ వెబ్‌సిరీస్ సక్సెస్‌ మీట్‌‌లో హీరో శివాజీ తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తనలాంటి వారు రాజకీయాలకు పనికి రారని, తాను రాజకీయాలకు సెట్ కానని శివాజీ అన్నాడు.  యాక్టింగ్‌లోనే ఉంటానని, ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వారి గొంతుకగా ఉంటానని స్పష్టం చేశాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసమే గతంలో తాను పోరాటం చేశానని, ఆ విషయంలో సంతోషంగా ఉన్నానని అన్నాడు. 

ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజలు, నాయకులు కలిసి ఉంటున్నారని అన్నారు. నిజాలు మాట్లాడతాను కాబట్టి అందరికీ సమస్యేనని, ప్రత్యక్ష రాజకీయాల్లో తాను ఎప్పుడూ భాగం కాలేదని ప్రస్తావించాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనలేదని, వాటితో తనకు సంబంధం లేదని అన్నాడు. ఉద్దేశపూర్వకంగా తనను ఏదైనా రాజకీయ పార్టీకి ఆపాదిస్తే కచ్చితంగా ఆ పార్టీలోనే చేరతానని, అందరి పని చెబుతానని అన్నారు. అందుకే తన జోలికి రావొద్దని హెచ్చరించారు.

‘నైన్టీస్: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ వెబ్‌సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌ చేయడానికి ప్రధాన కారణం ఆదిత్య (సిరీస్‌లోని చిన్న కొడుకు పాత్ర) అని చెప్పాడు. తన చిన్న కొడుకు కూడా అలాగే సరదాగా ఉంటాడని గుర్తుచేసుకున్నాడు. ఈ వెబ్ సిరీస్‌ విజయం ఒత్తిడికి గురి చేసిందా? అని ప్రశ్నించగా పని విషయంలో ఎలాంటి టెన్షన్‌ లేదని శివాజీ చెప్పాడు. తన సంతృప్తి కోసమే సినిమాలు చేస్తున్నానని, నైన్టీస్ సీక్వెల్‌ కూడా ఇలాగే మనసుని హత్తుకునేలా ఉంటుందన్నాడు. ఇంటర్‌, ఇంజినీరింగ్‌ గురించి సీక్వెల్‌లో చూపిస్తానని, తన జీవితాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఆదిత్య రోల్‌ క్రియేట్‌ చేశానని, అందుకే తన పేరే పెట్టానని వివరించారు. క్రైమ్‌ థ్రిల్లర్స్‌ క్రియేట్‌ చేయడం సులభమే కానీ జీవితాన్ని స్క్రీన్‌పైకి తీసుకురావడం అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక ఎనిమిది స్క్రిప్ట్‌లు విన్నానని, కామెడీ స్క్రిప్ట్ ఓకే చేశానని వివరించారు. విలన్‌గా కూడా చేస్తున్నానని శివాజీ చెప్పాడు.
Hero Shivaji
Politics
90s middle class biopic
Tollywood
movies news

More Telugu News