Konathala Ramakrishna: నేను ఏ పార్టీలో చేరేది ఈ నెల 21న చెబుతా: కొణతాల

  • హైదరాబాదులో పవన్ ను కలిసిన కొణతాల రామకృష్ణ
  • నేడు వైజాగ్ తిరిగొచ్చిన మాజీ మంత్రి
  • పవన్ తో అన్ని విషయాలు మాట్లాడానని వెల్లడి
Konathala says he will announce his political career on Jan 21

చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు సంసిద్ధులవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లిన కొణతాల జనసేనాని పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపిన అనంతరం నేడు విశాఖకు తిరిగి వచ్చారు. ఆయనకు విశాఖ విమానాశ్రయంలో మద్దతుదారుల నుంచి ఘనస్వాగతం లభించింది. 

ఈ సందర్భంగా కొణతాల మీడియాతో మాట్లాడుతూ, పవన్ తో అన్ని విషయాలు మాట్లాడానని, వాటిపై తన శ్రేయోభిలాషులతో చర్చిస్తానని తెలిపారు. ముందు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటానని... ఎంపీగా పోటీ చేయాలో, అసెంబ్లీ బరిలో దిగాలో ఆ తర్వాత నిర్ణయించుకుంటానని చెప్పారు. ఈ నెల 21న తన మద్దతుదారులతో అనకాపల్లిలో సమావేశమవుతున్నానని, తాను ఏ పార్టీలో చేరబోయేది ఆ రోజు చెబుతానని వెల్లడించారు.

More Telugu News