Stock Market: మూడు రోజుల తర్వాత లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

  • స్టాక్ మార్కెట్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు
  • 496 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 160 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Stock markets closed in profits after 3 days losses

కొన్ని రోజులుగా నష్టాలను చవిచూస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. ఈ ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో లాభాలలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 496 పాయింట్లు లాభపడి 71,683కి చేరుకుంది. నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 21,622 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (-3.52%), ఎన్టీపీసీ (-3.04%), టెక్ మహీంద్రా (-2.56%), టాటా స్టీల్ (-2.43%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.38%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.24%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.08%), కోటక్ బ్యాంక్ (-0.66%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.10%).

More Telugu News