షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఏపీ సీఎం జగన్.... ఫొటోలు ఇవిగో!
- షర్మిల తనయుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం
- హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ లో వేడుక
- మేనల్లుడు రాజారెడ్డిని ఆత్మీయంగా హత్తుకున్న సీఎం జగన్
ఇక, నిశ్చితార్థ వేడుక జరుపుకుంటున్న మేనల్లుడు రాజారెడ్డిని సీఎం జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. రాజారెడ్డికి, అట్లూరి ప్రియకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె తల్లిదండ్రులకు అభివాదం చేశారు. ఈ వేడుకకు విచ్చేసిన తల్లి విజయమ్మతోనూ జగన్ ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి కూడా విచ్చేశారు.



