Siren: నేరుగా ఓటీటీకి వచ్చేస్తున్న 'సైరన్'

  • తమిళంలో రూపొందిన 'సైరన్'
  • యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా 
  • ఈ నెల 26 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ 
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న కీర్తి సురేశ్

Siren movie update

తమిళంలో జయం రవి కథానాయకుడిగా 'సైరన్' సినిమా రూపొందింది. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామా ఇది. సుజాత - అనూష నిర్మించిన ఈ సినిమాకి, ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించాడు. జయం రవి సరసన నాయికగా కీర్తి సురేశ్ నటించగా, మరో కీలకమైన పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ సినిమా డిసెంబర్ లోనే తమిళనాట థియేటర్స్ కి రావలసింది. 

కానీ ఇప్పుడు ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయడం లేదనీ, నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రానుందని చెబుతున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలవుతుందని సమాచారం.

అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసే హీరో ఎందుకు క్రిమినల్ గా మారతాడు? జైల్లో అతనికి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? విడుదలైన తరువాత అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేదే కథ. కీర్తి సురేశ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండటం విశేషం. 

More Telugu News