వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరు: కొడాలి నాని
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ ఫ్లెక్సీలను తొలగించారంటూ కొన్ని ఛానళ్లలో వార్తలు
- జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై బాలయ్య పడ్డారని కొడాలి నాని మండిపాటు
- వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినవారు ఆయన వర్ధంతిని చేయడం ఏమిటని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబును రారమ్మని పిలుస్తోందని అన్నారు. తన కొడుకునే సీఎం చేయాలనేదే చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. జగన్ పక్కన పెట్టేసిన నేతలే చంద్రబాబును కలుస్తున్నారని అన్నారు.