Dhanush: మొదలైన ధనుశ్ - శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్!

  • పట్టాలెక్కిన ధనుశ్ 51వ సినిమా
  • తన స్టైల్ కి భిన్నంగా వెళుతున్న శేఖర్ కమ్ముల  
  • కథానాయికగా రష్మిక మందన 
  • కీలమైన పాత్రను పోషిస్తున్న నాగార్జున 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్

Sekhar Kammula Movie Update

శేఖర్ కమ్ముల అనగానే సున్నితమైన భావోద్వేగాలు కలిగిన ప్రేమకథా చిత్రాలు కళ్లముందు కదలాడతాయి. ఆనంద్ .. గోదావరి .. ఫిదా .. లవ్ స్టోరీ వంటి సినిమాలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవవచ్చు. అలాంటి శేఖర్ కమ్ముల ఈ సారి తన మార్క్ కథలను కాకుండా, భిన్నమైన మరో కంటెంట్ ను రెడీ చేసుకున్నాడు. ఈ సారి ఆయన కథానాయకుడుగా ధనుశ్ వంటి స్టార్ ను ఎంచుకున్నాడు. అంతేకాదు .. మాఫియా నేపథ్యంలో కథను తయారు చేసుకున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నాడు. ఇక సంగీత దర్శకుడిగా ఆయన దేవిశ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడం మరో విశేషం. ఇలా అనేక విశేషాలు ఈ ప్రాజెక్టులో కనిపిస్తున్నాయి. సునీల్ నారంగ్ - పుస్కూర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా, కొంతసేపటి క్రితం షూటింగును మొదలెట్టేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి కూడా. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. కెరియర్ పరంగా ధనుశ్ కి ఇది 51వ సినిమా కావడం విశేషం. 

More Telugu News