అయోధ్య రామయ్య దర్శనానికి రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. ఏపీ, తెలంగాణ నుంచి రైళ్లే రైళ్లు
- సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు
- ఈ నెల 29 నుంచి వచ్చే నెల 28 వరకు అందుబాటులో ప్రత్యేక రైళ్లు
- సద్వినియోగం చేసుకోవాలన్న రైల్వే
ప్రత్యేక రైళ్లు ఇలా..
సికింద్రాబాద్-అయోధ్య రైళ్లు ఈ నెల 29 నుంచి రోజువిడిచి రోజు బయలుదేరుతాయి. అంటే ఈ నెల 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరుతాయి.
కాజీపేట నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు కూడా రోజువిడిచి రోజు బయలుదేరుతాయి. ఈ నెల 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరుతాయి.
విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, గుంటూరు నుంచి ఈ నెల 31న, రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న, సామర్లకోట నుంచి వచ్చే నెల 11న అయోధ్యకు రైళ్లు బయలుదేరుతాయి. ఆయా స్టేషన్లలో బయలుదేరిన రైళ్లు తిరిగి అయోధ్య నుంచి అవే స్టేషన్లకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.