అయోధ్య రామమందిరం గర్భ గుడిలోకి చేరిన ప్రధాన విగ్రహం
- గురువారం తెల్లవారు జామున క్రేన్ సాయంతో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చిన ఆలయ నిర్మాణ కమిటీ
- వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య ఆలయంలోకి విగ్రహం చేరవేత
- ప్రాణప్రతిష్ఠ జరిగే 22 వరకు కొనసాగనున్న పూజా కార్యక్రమాలు
జనవరి 21 వరకు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని, 'ప్రాణప్రతిష్ఠ' రోజున కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయని ట్రస్ట్ అధికారులు తెలిపారు. కాగా రామాలయం 'ప్రాణ ప్రతిష్ఠ' మధ్యాహ్నం 12:20 గంటలకు మొదలై మధ్యాహ్నం 1 గంటలోపు ముగియనుంది. అంతకుముందు బుధవారం ప్రధాన విగ్రహం ప్రతీకాత్మక ప్రతిరూపాన్ని ఆలయంలోకి తీసుకొచ్చారు. 'కలశ పూజ' నిర్వహించారు. ప్రస్తుతం 121 మంది 'ఆచార్యులు' ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులను నిర్వహిస్తున్నారు.