Tie: టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ మూడో టీ20 టై... సూపర్ ఓవర్ లోకి మ్యాచ్

  • టీమిండియా, ఆఫ్ఝన్ జట్ల మధ్య మూడో టీ20
  • రెండు జట్ల స్కోర్లు సమం
  • తొలుత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసిన టీమిండియా
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేసిన ఆఫ్ఘన్ 
  • ఫలితం తేల్చేందుకు సూపర్ ఓవర్
Team India and Afghanistan 3rd T20 enters into Super Over

టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ టై అయింది. రెండు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ లోకి ప్రవేశించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. 

22 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకున్న టీమిండియా... ఆ తర్వాత భారీ స్కోరు సాధించిందంటే అందుకు కారణం రోహిత్ శర్మ, రింకూ సింగ్. రోహిత్ శర్మ 121, రింకూ సింగ్ 69 పరుగులతో అజేయంగా నిలిచారు. 

ఆ తర్వాత 213 పరుగుల లక్ష్యఛేదనలో ఆఫ్ఘన్ జట్టు అద్భుతంగా పోరాడింది. ఆ జట్టు బ్యాటర్లు పోరాటపటిమ చూపడంతో కొండంత స్కోరు కూడా కరిగిపోయింది. చివరి ఓవర్లో ఆఫ్ఘనిస్థాన్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా... 18 పరుగులే చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 212 పరుగులు చేసింది. 

ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ లో రహ్మనుల్లా గుర్బాజ్ 50, కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్ 50 పరుగులతో రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 93 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత గుల్బదిన్ నాయబ్, మహ్మద్ నబీ జోడీ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. నాయబ్ 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నబీ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 34 పరుగులు సాధించాడు. 

టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, అవేష్ ఖాన్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్ ద్వారా తేలనుంది.

More Telugu News