రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం
- 22న అయోధ్య రామాలయ ప్రారంభం
- దాదాపు ఆరువేల మంది అతిథుల సమక్షంలో రామయ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం
- చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు
22న జరగనున్న అయోధ్య ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరువేల మంది అతిథుల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. తాజాగా చంద్రబాబుకు కూడా ఆహ్వానపత్రిక అందింది.