Chandrababu: రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం

Chandrababu Got Invitation From Ayodhya Ram Mandir Pran Pratistha
  • 22న అయోధ్య రామాలయ ప్రారంభం
  • దాదాపు ఆరువేల మంది అతిథుల సమక్షంలో రామయ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం
  • చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 22న జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది.

22న జరగనున్న అయోధ్య ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరువేల మంది అతిథుల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. తాజాగా చంద్రబాబుకు కూడా ఆహ్వానపత్రిక అందింది.
Chandrababu
Ayodhya Ram Mandir
Pran Pratistha
Telugudesam

More Telugu News