K Kavitha: రేపు నేను విచారణకు హాజరు కాలేను: ఈడీకి కవిత లేఖ

  • తనకు సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు ఉన్నాయన్న కవిత
  • ఈ నెల 5వ తేదీనే కవితకు ఈడీ నోటీసులు
  • కవితను గతంలో మూడుసార్లు విచారించిన ఈడీ
Kavitha letter to ED

రేపు తాను విచారణకు హాజరు కాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో రేపు ఉదయం విచారణకు హాజరు కావాలని ఈడీ కవితకు నోటీసులు పంపించింది. దీంతో కవిత హాజరు కాలేనని చెబుతూ ఈడీకి లేఖ పంపించారు. తనకు సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. తన కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. 16న ఉదయం విచారణకు హాజరు కావాలని కవితకు ఈ నెల 5వ తేదీనే ఈడీ నోటీసులు జారీ చేసింది.

లిక్కర్ కేసులో కవితను ఈడీ మూడుసార్లు విచారించింది. నాలుగోసారి నోటీసులు ఇవ్వడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళలను ఇంటి వద్ద లేదా వీడియో విచారణ జరపాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కవితకు ఊరట లభించింది. ఈ క్రమంలో ఈడీ మరోసారి ఆమెకు నోటీసులు పంపించింది. కానీ తాను విచారణకు హాజరుకాలేనని కవిత స్పష్టం చేశారు.

More Telugu News