Mega Family: ఇది మెగా-అల్లు గ్రూప్ ఫొటో... సంక్రాంతి జోష్ మామూలుగా లేదు!

  • సంక్రాంతికి బెంగళూరు వెళ్లిన మెగా, అల్లు కుటుంబాలు
  • ఫాంహౌస్ లో సంబరాలే సంబరాలు
  • నెట్టింట వైరల్ అవుతున్న మెగా, అల్లు వారి గ్రూప్ ఫొటో
Mega and Allu group photo went viral

మెగా, అల్లు కుటుంబాలు ఈ సంక్రాంతికి బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి ఫామ్ హౌస్ లో మెగా, అల్లువారి సంక్రాంతి సంబరాలు మామూలుగా లేవు. మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి నుంచి నిన్న మొన్న పెళ్లయిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి జోడీ వరకు ఈ సంక్రాంతి సంబరాల్లో సందడి చేస్తున్నారు. మెగా, అల్లు వారింటి పిల్లలు అయితే సరే సరి! మొత్తమ్మీద పండుగ జోష్ ఈ సినీ జీవుల కుటుంబ సభ్యుల్లో వెల్లివిరిసింది. 

తాజాగా, మెగా, అల్లు కుటుంబాల గ్రూప్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెద్దవాళ్ల నుంచి పిల్లల వరకు అందరినీ ఈ ఫొటోలో చూడొచ్చు. మెగా, అల్లు అభిమానులకు ఈ ఫొటో కనులపండుగేనని చెప్పాలి. మగవాళ్లందరూ వైట్ షేడ్ లో ఉన్న దుస్తులు ధరించగా, ఆడవాళ్లు ఎరుపు కాంబినేషన్ లో దుస్తులు ధరించారు. ఒక్క పవన్ కల్యాణ్ మాత్రం ఈ ఫొటోలో మిస్సయ్యారు.

More Telugu News