సచిన్ డీప్ ఫేక్ వీడియోతో ప్రచారం.. సీరియస్ గా స్పందించిన క్రికెటర్
- గేమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ ప్రచారం
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- రిపోర్ట్ కొట్టాలంటూ అభిమానులకు సచిన్ పిలుపు
లక్షలాదిమంది చూసిన ఈ వీడియో విషయం సచిన్ టెండూల్కర్ దాకా చేరింది. అలాంటి యాడ్ తాను ఎన్నడూ చేయలేదన్న సచిన్.. వెంటనే ఆ వీడియోను చూశాడు. ఆపై అది ఫేక్ అని, డీప్ ఫేక్ టెక్నాలజీతో తయారు చేసిందని చెప్పాడు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి వీడియోలు తీయడం సరికాదంటూ సీరియస్ అయ్యాడు. ఈ తరహా వీడియోలు ఎక్కడ చూసినా వెంటనే రిపోర్ట్ కొట్టాలని తన అభిమానులకు సచిన్ పిలుపునిచ్చాడు.