జగన్ తన అంతరాత్మను పరిశీలించుకోవాలి: గంటా శ్రీనివాసరావు
- విశాఖ టీడీపీ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు
- హాజరైన గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు
- జగన్ భీమిలి నుంచి ప్రజాయాత్రలు చేస్తాడంట అంటూ గంటా వ్యంగ్యం
జగన్ తన అంతరాత్మను పరిశీలించుకోవాలని హితవు పలికారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి ఒక్క స్థానం కూడా లభించదని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల బదిలీలు ఎప్పుడూ చూడలేదని, జగన్ ఎంపీలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని గంటా విమర్శించారు. దాంతో వైసీపీ నేతలు ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. సగానికి సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలకు బయటికి వచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. క్రికెటర్ అంబటి రాయుడు ఏదో అనుకుని వైసీపీలోకి వెళ్లాడని, కానీ పరుగులు చేయకుండానే బయటికి వచ్చేశాడని పేర్కొన్నారు.