కీలక సమావేశానికి డుమ్మా కొట్టి.. 'గుంటూరు కారం' చూసిన బాలినేని

  • వైసీపీలో హీట్ పెంచుతున్న మార్పులు, చేర్పులు
  • ఒంగోలు టికెట్ పై బాలినేనికి క్లారిటీ ఇవ్వని జగన్
  • పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న బాలినేని
ఓవైపు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మార్పులు, చేర్పులు వైసీపీలో హీట్ పెంచుతున్నాయి. టికెట్ దక్కక అసంతృప్తికి గురవుతున్న వారి సంఖ్య, ఇతర పార్టీల్లోకి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సైతం ఎవరికి టికెట్ దక్కుతుందో? ఎవరికి దక్కదో? అనే టెన్షన్ నేతల్లో నెలకొంది. 

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో వైసీపీ కీలక నేతల సమావేశం జరిగింది. అయితే మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఈ భేటీకి డుమ్మా కొట్టారు. హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో చాలా కూల్ గా కూర్చుని మహేశ్ బాబు తాజా చిత్రం 'గుంటూరు కారం' సినిమాను బాలినేని వీక్షించారు. ఆయన సినిమా చూస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ విషయంలో తనకు జగన్ క్లారిటీ ఇవ్వక పోవడం వల్లే బాలినేని ఈ విధంగా అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు చెపుతున్నారు. వైసీపీ తొలి జాబితా విడుదల అయినప్పటి నుంచి ఆయన పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

Balineni Srinivasa Reddy
YSRCP
Guntur Kaaram
Mahesh Babu
Tollywood

More Telugu News