Indigo: విమానం అయోధ్య వెళుతోంది... రామలక్ష్మణులు, సీత వేషాల్లో ఇండిగో సిబ్బంది!

  • అయోధ్యలో  ఈ నెల 22న రామ మందిరం ప్రారంభోత్సవం
  • అయోధ్యకు నేరుగా విమానాలు నడుపుతున్న ఎయిర్ లైన్స్ సంస్థలు
  • నిన్న ఇండిగో విమానం ప్రారంభం
Indigi airlines staff has seen as Rama Lakshmana and Seetha

అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరం ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ట జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ విమానయాన సంస్థలు దేశంలోని వివిధ నగరాల నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడుపుతున్నాయి. ఈ క్రమంలో ఇండిగో విమాన సంస్థ కూడా గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు ఓ సర్వీసును నడుపుతోంది. ఆ విమాన సర్వీసు నిన్న ప్రారంభం అయింది. 

ఈ నేపథ్యంలో, ఇండిగో సిబ్బంది రామ, లక్ష్మణ, సీత, హనుమంతుడి వేషధారణలో కనువిందు చేశారు. వీరిని ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఇండిగో సిబ్బంది రామ, లక్ష్మణ, సీత వేషాల్లో ఉంటూనే బోర్డింగ్ అనౌన్స్ మెంట్, ప్రయాణికులకు ఆహ్వానం పలకడం వంటి విధులు నిర్వర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 

కాగా, అహ్మదాబాద్-అయోధ్య ఇండిగో విమానం వారంలో మూడు రోజులు నడుస్తుంది. ఈ విమాన సర్వీసును ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వర్చువల్ గా ప్రారంభించారు.

More Telugu News