సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్.. ఖాళీ అవుతున్న నగరం
- పంతంగి టోల్‌ప్లాజా వద్ద నిలిచిపోయిన వందలాది వాహనాలు
- 10 గేట్లు తెరిచి వాహనాలను పంపిస్తున్న అధికారులు
- నిర్మానుష్యంగా మారుతున్న హైదరాబాద్ రోడ్లు
సాధారణ రోజుల్లో ఈ టోల్‌ప్లాజా మీదుగా రోజుకు 30 వేల వరకు వెళ్లే వాహనాల సంఖ్య సంక్రాంతి రోజుల్లో 60 నుంచి 70 వేల వరకు ఉంటుందని టోల్‌ప్లాజా అధికారులు తెలిపారు. ఏపీ వాసులు పెద్ద ఎత్తున తమ ఊళ్లకు వెళుతుండడంతో హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నగరంలో ట్రాఫిక్ జామ్‌లు కనిపించడం లేదు. ప్రతి కూడలిలో వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి.