Mukesh Ambani: 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ముకేశ్ అంబానీ గ్రాండ్ ఎంట్రీ.. రిలయన్స్ మార్కెట్ విలువ ఎంతంటే..!

  • ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో ముకేశ్
  • అంబానీ నికర విలువ రూ.8,73,815 కోట్లు
  • రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 1839000,00,00,000 
  • బిలియనీర్ల జాబితాలో అదానీది 16వ స్థానం
Mukesh Ambani enters In Forbes Real Time Billionaires List

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి మరోమారు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. రూ.8,73,815 కోట్ల నికర విలువతో  2024 ఏడాది మొదట్లోనే రియల్ టైం బిలియనీర్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఆయన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1839000,00,00,000 మార్కెట్ విలువతో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రికార్డులకెక్కింది. ఇక, ప్రపంచ సంపన్నుల జాబితా విషయానికి వస్తే ముకేశ్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ జాబితాలోని 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో మొత్తం 12 మంది బిలియనీర్లు మాత్రమే ఉండడం గమనార్హం. 

అగ్రస్థానంలో కొనసాగుతున్న మస్క్
ముకేశ్ అంబానీ చివరిసారి 2021లో 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు. అయితే, ఆ తర్వాత ఆయన ఆస్తుల విలువ పడిపోవడంతో ఆ జాబితా నుంచి బయటకు వచ్చారు. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ 240.9 బిలియన్ డాలర్ల నికర విలువతో ఇప్పటికీ ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ఇక, ఇండియాలో అత్యంత సంపన్నుల్లో ముకేష్ అంబానీ (104.7 బిలియన్ దాలర్లు) తర్వాత గౌతం అదానీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అదానీ 79.4 బిలియన్ డాలర్లతో 16వ స్థానంలో ఉన్నారు.

More Telugu News