Kishan Reddy: ఏపీలో రేపు మూడు కొత్త రైళ్లను ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union minister Kishan Reddy inaugurates three new trains in AP
షార్ట్స్‌లో చూడండి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏపీలో రేపు (జనవరి 12) మూడు కొత్త రైళ్లను ప్రారంభించనున్నారు. విశాఖ-గుంటూరు, నంద్యాల-రేణిగుంట, నర్సాపూర్-హుబ్బళ్లి రైళ్లకు ఆయన పచ్చజెండా ఊపనున్నారు. ఈ రైళ్లు రేపటి నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 

అటు, పలు ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువస్తోంది. నెం.07041 కాచిగూడ-తిరుపతి, నెం.07042 తిరుపతి-కాచిగూడ, నెం.07060 తిరుపతి-సికింద్రాబాద్, నెం.07487 హెచ్ఎస్ నాందేడ్-కాకినాడ టౌన్, నెం.07488 కాకినాడ టౌన్-హెచ్ఎస్ నాందేడ్ రైళ్లను కూడా ప్రారంభిస్తోంది. 

కాచిగూడ-తిరుపతి రైలు జనవరి 12న, తిరుపతి-కాచిగూడ రైలు జనవరి 13న, తిరుపతి-సికింద్రాబాద్ రైలు జనవరి 12న, నాందేడ్-కాకినాడ రైలు జనవరి 15న, కాకినాడ-నాందేడ్ రైలు జనవరి 16న ప్రారంభం కానున్నాయి.
Go Back to Shorts
Kishan Reddy
New Trains
Andhra Pradesh
Special Trains

More Telugu News