GHMC: ట్రేడ్ లైసెన్స్‌పై హైదరాబాద్ వ్యాపారులకు జీహెచ్ఎంసీ కీలక సూచన

  • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోవాలని సూచన
  • ఈ నెలాఖరు లోపు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించిన జీహెచ్ఎంసీ
  • ట్రైడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిక
GHMC suggestion on trade licence

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) సూచించింది. ఇదివరకు తీసుకున్న ట్రేడ్ లైసెన్స్ గడువు డిసెంబర్ 31, 2023తో ముగిసిందని... ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు లోపు... 2024 సంవత్సరానికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని అలర్ట్ చేసింది. ఇప్పుడు తీసుకునే ట్రేడ్ లైసెన్స్ డిసెంబర్ 31, 2024 వరకు చెల్లుబాటు అవుతుందని తెలిపింది.

చెల్లింపులు జరిపిన తర్వాత ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరుద్ధరణ ధరను చెల్లించిన తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఆటోమేటిక్‌గా పునరుద్ధరించబడుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ నెలలోగా రెన్యూవల్ చేయించుకోకుంటే అదనపు ఛార్జీ పడుతుందని హెచ్చరించారు.

జులై 27, 2017 నాటి రిజల్యూషన్ నెం.19 ప్రకారం లైసెన్స్ లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే ఆ సమయంలో వ్యాపారికి 100 శాతం జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. దీంతో పాటు పది శాతం అదనపు జరిమానా కూడా విధించబడుతుందని తెలిపారు.

More Telugu News