Guntur Kaaram: సరదాగా .. సందడిగా సాగిన 'గుంటూరు కారం' షూటింగ్.. మేకింగ్ వీడియో రిలీజ్!

  • రేపు విడుదలవుతున్న 'గుంటూరు కారం'
  • ప్రధానమైన బలంగా నిలిచే మాస్ కంటెంట్ 
  • ఇప్పటికే పెరిగిపోయిన అంచనాలు
  • కొత్త రికార్డులు ఖాయమంటున్న ఫ్యాన్స్

Mahesh Babu shares Guntur Kaaram Making Video

త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో  రూపొందిన 'గుంటూరు కారం' రేపు థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ నిర్మాణం .. పాటల చిత్రీకరణ .. యాక్షన్ సీన్స్ షూట్ కి సంబంధించిన విషయాలు మేకింగ్ వీడియోలో కనిపిస్తున్నాయి. 

ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికలుగా శ్రీలీల - మీనాక్షి చౌదరి కనువిందు చేయనున్నారు. ముఖ్యమైన పాత్రలలో ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. సునీల్ .. జయరామ్ తదితరులు నటించారు. వాళ్లంతా కాంబినేషన్స్ సీన్స్ ను ఎంజాయ్ చేస్తూ చేయడం మేకింగ్ వీడియోలో కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందనే విషయం అర్థమవుతోంది. 

ఈ కథ అంతా కూడా గుంటూరు నేపథ్యంలోనే జరుగుతుంది. మాస్ కంటెంట్ ఉన్న సినిమాలు ఇష్టపడేవాళ్లంతా కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ .. మహేశ్ బాబు మార్క్ యాక్షన్ .. శ్రీలీల గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనున్నాయి.  ఓపెనింగ్స్ తోనే రికార్డులు సృష్టించడం ఖాయమనేది అభిమానులు చెబుతున్న మాట.

More Telugu News