Ashok Gajapathiraju: ఇంత సింప్లిసిటీనా.. సాధారణ ప్రయాణికుడిలా రైల్వేస్టేషన్‌లో అశోక్ గజపతిరాజు.. ఫొటో ఇదిగో

Ashok Gajapathiraju at the railway station like a common passenger in Hyderabad
  • హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో సామాన్య ప్రయాణికుడిలా కనిపించిన టీడీపీ సీనియర్ నేత
  • కుటుంబ సభ్యులతో కలిసి స్టేషన్‌లో దిమ్మెపై కూర్చున్న మాజీ కేంద్ర మంత్రి
  • అధికారం ఆయనను ఎప్పుడూ తప్పుదోవ పట్టించలేదంటూ ఎక్స్ వేదికగా ఫొటో షేర్ చేసిన టీడీపీ  
గతంలో కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు రాజకుటుంబానికి చెందినవారు. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన మంగళవారం ఒక సామాన్య ప్రయాణికుడిలా హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో కనిపించారు. హైదరాబాద్ నుంచి ఇంటికి బయలుదేరిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్టేషన్‌కు వచ్చారు. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ఒక దిమ్మెపై తోటి ప్రయాణికుల పక్కన కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోని టీడీపీ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది. 

స్వతహాగా రాజు అయిన అశోక్ గజపతి రాజు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్లడానికి సామాన్యుడిలా రైల్వే స్టేషన్‌లో ఎదురుచూశారని తెలిపింది. ఆయన నిజాయతీకి, పరిపూర్ణతకు ప్రతిరూపమని అభివర్ణించింది. ఎల్లప్పుడూ ప్రజలకు ఏది ఉత్తమమో అదే చేస్తుంటారని ప్రశంసించింది. అధికారం ఎప్పుడూ ఆయనను తప్పుదోవ పట్టించలేదని, తెలుగు దేశం అంటే ఇదని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ashok Gajapathiraju
Hyderabad
Railway station
Telugudesam
Andhra Pradesh

More Telugu News