Gunturu Karam: 'మహేశ్ బాబు నిజంగా బంగారు బొమ్మే!' అంటున్న శ్రీలీల

Gunturu Karam Movie Pre Release Event
  • గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఆకుపచ్చని చీరకట్టులో ఆకట్టుకున్న శ్రీలీల
  • మహేశ్ ను చూస్తూ డైలాగ్స్ మరిచిపోయానని వ్యాఖ్య
  • ఆయన గురించి ఇంట్లో వాళ్లకి అలా చెప్పానని వెల్లడి

సాధారణంగా అమ్మాయిలు అందంగా ఉంటే 'బంగారు బొమ్మలా ఉంది' అని అనుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మహేశ్ బాబు .. బంగారు బొమ్మలా ఉంటాడని అంటూ .. నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో శ్రీలీల చెప్పడం జరిగింది. నిజంగానే టాలీవుడ్ లోని హీరోలలో మహేశ్ బాబుకి 'అందగాడు' అనే ట్యాగ్ ఉంది. ఈ సినిమా కోసం ఆయన మరింత హ్యాండ్సమ్ గా మారాడు కూడా. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, సంక్రాంతి బరిలోకి ముందుగా దిగిన సినిమా.

ఈ సినిమా కథా నేపథ్యం అంతా కూడా 'గుంటూరు'లోనే జరుగుతుంది. హీరో గుంటూరు వాసిగానే కనిపిస్తాడు. అక్కడి మిర్చి మార్కెట్ నేపథ్యంలోనే కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. అందువలన గుంటూరునే ప్రీ రిలీజ్ ఈవెంటును జరిపారు. ఈవెంటులో ఆకుపచ్చ రంగు శారీలో శ్రీలీల చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించింది. అందరూ ఆమె అందాన్ని అలా చూస్తూ ఉంటే, ఆమె మహేశ్ బాబు అందం గురించి మాట్లాడటం అభిమానులను ఆకట్టుకుంది.

"మహేశ్ బాబు గారు చాలా అందంగా కనిపిస్తారు. ఆయనను చూస్తూ నేను చాలా సార్లు డైలాగ్స్ మరిచిపోయేదానిని. అది ఆయన గమనించే ఉంటారని అనుకుంటున్నాను. ఈ సినిమాలో మహేశ్ బాబుగారితో కలిసి మొదటి రోజు షూటింగులో పాల్గొన్న తరువాత ఇంటికి వెళ్లాను. మహేశ్ బాబు ఎలా ఉంటారని ఇంట్లో వాళ్లు అడిగారు. అప్పుడు నా మనసులో నుంచి ఒక మాట వచ్చింది. ఒక బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటారో .. అలా ఉంటారని చెప్పాను" అంటూ అక్కడి జనంలో హుషారు పెంచారు.
Gunturu Karam
Mahesh Babu
Sreeleela
Trivikram Srinivas

More Telugu News