LG: ఎల్జీ వినూత్న ఆవిష్కరణ... అసలు ఉందా లేదా అనిపిస్తున్న సూపర్ టీవీ!

  • అమెరికాలో సీఈఎస్ టెక్ షో
  • తన అత్యాధునిక టీవీని ప్రదర్శించిన ఎల్జీ సంస్థ
  • వైర్ లెస్ ట్రాన్స్ పరెంట్ ఓఎల్ఈడీ టీవీగా పిలుస్తున్న ఎల్జీ
  • టెక్ షోలో ఎల్జీ టీవీని చూసి నోరెళ్లబెట్టిన సందర్శకులు 
LG reveals Wireless Transparent OLED Television

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం 'ఎల్జీ' (LG) నెక్ట్స్ జనరేషన్ టీవీలను ఆవిష్కరించింది. ఎంతో పారదర్శకమైన తెరలతో కూడిన ఈ టీవీలు ఔరా అనిపిస్తున్నాయి. అమెరికాలో జరుగుతున్న సీఈఎస్ టెక్ షోలో ఎల్జీ ఈ సూపర్ టెక్నాలజీ టీవీలను ప్రదర్శించింది. అసలు ఇలాంటి టీవీలు సాధ్యమేనా అని అందరూ అనుకునేలా ఈ సరికొత్త టీవీలు చూపరులకు విభ్రాంతి కలిగిస్తున్నాయి. 

ఓ గాజు ముక్కలా... ఒకవైపు నుంచి చూస్తే మరోవైపు కనిపించేలా ఉన్న ఈ ఎల్జీ టీవీ టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని వైర్ లెస్ ట్రాన్స్ పరెంట్ ఓఎల్ఈడీ టీవీగా పిలుస్తున్నారు. గాజుపై ఆర్గానిక్ మెటీరియల్ ను ముద్రించి ఈ టీవీ తెరను డిజైన్ చేశారు. 

సీఈఎస్ టెక్ షోకి వచ్చిన వారు ఎల్జీ టీవీని చూడకుండా వెళ్లడంలేదంటే అతిశయోక్తి కాదు. టెక్ షో సందర్భంగా ఈ టీవీలో ప్రదర్శించిన కంటెట్ ను చూసి సందర్శకులు నోరెళ్లబెట్టారు. అందులోని దృశ్యాలు కళ్లముందే జరిగినట్టు ఉండడంతో టెక్ నిపుణులు సైతం వావ్ అనకుండా ఉండలేకపోయారు. 

ఈ వైర్ లెస్ ట్రాన్స్ పరెంట్ ఓఎల్ఈడీ టీవీ ఎంత పారదర్శకంగా ఉందంటే... టీవీ ఆఫ్ చేస్తే అందులోని విడిభాగాలు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

More Telugu News