Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ

Jagga Reddy meets CM Revanth Reddy
  • జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిసిన జగ్గారెడ్డి
  • దాదాపు ఇరవై నిమిషాలు ఇరువురి మధ్య చర్చ
  • రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన నేతలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కలిశారు. మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కలిశారు. ఇరువురు దాదాపు ఇరవై నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిస్థితులపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన నాయకులకు ఎమ్మెల్సీలు ఇవ్వాల్సి ఉందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ, లోక్ సభ స్థానాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడి ఉంటారనే చర్చ సాగుతోంది.

  • Loading...

More Telugu News