Crime News: నన్ను ప్రేమిస్తే సరే.. లేదంటే నువ్వు కాల్‌గార్ల్‌వి అయిపోతావ్.. జూబ్లీహిల్స్‌లో యువకుడి బెదిరింపు

Jubilee Hills police files case against man who warns girl
  • యువతి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • ప్రేమించకుంటే కాల్‌గర్ల్‌వని సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని హెచ్చరిక
  • ఆగడాలు శ్రుతిమించడంతోో పోలీసులకు ఫిర్యాదు
తనను ప్రేమించాల్సిందేనని, లేదంటే నువ్వు కాల్‌గర్ల్‌వని సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని బెదిరించిన యువకుడిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం కృష్ణానగర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి ప్రైవేటు ఉద్యోగి. రెండేళ్ల క్రితం ఆమెకు ఇందిరానగర్‌కు చెందిన ఖయ్యూంతో స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో అవసరాల నిమిత్తం అతడి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్న ఆమె ఆ తర్వాత వడ్డీతో కలిపి తీర్చేసింది. ఆ తర్వాతి నుంచి ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడ్డాడు. 

ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకున్న ఖయ్యూం వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగక ఆమె ఇంటికి వెళ్లి ఫోన్ లాక్కుని, స్కూటర్‌ను ధ్వంసం చేశాడు. ఈ నెల 4న రాత్రి 10 గంటల సమయంలో యువతి ఇంటికి వెళ్లి బయటి నుంచి పెద్దగా కేకలు వేస్తూ దుర్భాషలాడాడు. నువ్వు కాల్‌గర్ల్‌వని సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని బెదిరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Crime News
Jubilee Hills
Love
Callgirl

More Telugu News