Ayodhya: ప్రధాని మోదీ మెచ్చుకున్న రామ భక్తి గీతం.. వీడియో ఇదిగో!

  • గుజరాతీ ఫోక్ సింగర్ గీతా రబారీ పాటను ట్విట్టర్ లో పంచుకున్న ప్రధాని
  • పాట వింటుంటే భావోద్వేగంగా ఉందని వెల్లడి
  • రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశమంతా ఎదురుచూస్తోందని వ్యాఖ్య
PM Modi Tweet

అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్నది.. దేశవిదేశాలలోని రామ భక్తులు ఆ క్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాముడికి స్వాగతం పలుకుతూ పలువురు గీతాలు, భజనలు రూపొందిస్తూ భక్తిని చాటుకుంటున్నారని చెప్పారు. వాటిలో తనకు నచ్చిన గీతాలను ప్రధాని మోదీ ట్వీట్టర్ ద్వారా పంచుకుంటూ గాయకులను మెచ్చుకుంటున్నారు. తాజాగా గుజరాతీ గాయని గీతా రబారీ పాడిన పాటను ట్వీట్ చేస్తూ.. ఈ పాట భావోద్వేగంగా ఉందంటూ మోదీ కామెంట్ చేశారు.

గుజరాత్ కు చెందిన గీతా రబారీ జానపద గాయని. అయోధ్య రాముడిపై తాజాగా ఓ భక్తి గీతాన్ని రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘మేరా రామ్ ప్రభూ జీ ఘర్ ఆయే..’ అంటూ సాగే ఈ పాటను విన్న ప్రధాని.. గీతా రబారీని మెచ్చుకున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ రాముడికి స్వాగతం పలుకుతూ సాగిన గీతం భావోద్వేగం కలిగించిందని మోదీ ట్వీట్ చేశారు.

More Telugu News