వైసీపీ నేతలు మమ్మల్ని సంప్రదిస్తున్నారు: అచ్చెన్నాయుడు
- శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
- అంబటి రాయుడును ఐదు రోజులకే డకౌట్ చేశారు..
- టెక్కలిలో కార్మిక చైతన్య యాత్రను ప్రారంభించిన అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో ఆందోళన చేయని కార్మికుడే లేడని అన్నారు. కార్మికుల కష్టాలు తెలుసుకోవడానికే ఈ బస్సు యాత్ర చేపట్టామని వివరించారు. పార్టీ మేనిఫెస్టోలో కార్మికుల సమస్యలను, టీడీపీ పరిష్కార మార్గాలను పొందుపరుస్తామని తెలిపారు. కాగా, కార్మిక చైతన్య బస్సు యాత్ర టెక్కలి నుంచి కుప్పం వరకు 26 రోజుల పాటు 92 నియోజకవర్గాలలో సాగుతుందని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్సీ దువ్వూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.