అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్ రావులు రెచ్చిపోతున్నారు.. నేను ఉండి ఉంటే..: జగ్గారెడ్డి
Advertisement

అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్ రావులు రెచ్చిపోతున్నారు.. నేను ఉండి ఉంటే..: జగ్గారెడ్డి

Jagga Reddy lashes out at harish rao and ktr
  • నేను అసెంబ్లీలో ఉండి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటలు సాగనిచ్చేవాడిని కాదన్న జగ్గారెడ్డి
  • రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ప్రశంస  
  • ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళలు ఆనందంగా ఉన్నారని వ్యాఖ్య
ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు ఆనందంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. మహిళలు బస్సులలో ప్రయాణించడం లేదని బీఆర్ఎస్ నేతలు అంటుండడాన్ని ఆయన ఖండించారు. ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణించారని తెలిపారు.

ఇక అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తాను కనుక అసెంబ్లీలో ఉండి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటలు సాగనిచ్చేవాడిని కాదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని... కానీ బీఆర్ఎస్ నేతలు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా? అని ప్రశ్నించారు.
Advertisement
Jagga Reddy
Congress

More Telugu News