ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో షర్మిల భేటీ
- ఖర్గే నివాసానికి వెళ్లిన షర్మిల
- కుమారుడి వివాహానికి ఆహ్వానం
- ప్రస్తుత రాజకీయాలపై చర్చలు
తనకు అప్పగించబోయే బాధ్యతలపై చర్చలు జరుగుతున్నాయని... ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆమె చెప్పారు. ఏ బాధ్యతలను ఇచ్చినా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కూడా షర్మిల కలిశారు. కుమారుడి వెడ్డింగ్ కార్డును ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు.