Houthi: అమెరికా హెచ్చరికలు బేఖాతరు.. ఎర్ర సముద్రంలో డ్రోన్ బోటును పేల్చేసిన హౌతీలు

  • నౌకలపై మరోమారు దాడిచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరిక
  • ఆ తర్వాతి రోజే డ్రోన్ బోటును పేల్చేసిన హౌతీ తిరుగుబాటుదారులు
  • ఎలాంటి నష్టం వాటిల్లలేదన్న అమెరికా నేవీ
Houthi rebels detonate drone boat in red sea

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ అమెరికా సహా దాని మిత్ర పక్షాలు చేసిన హెచ్చరికలను హౌతీ రెబల్స్ పెడచెవిన పెట్టారు. గురువారం ఎర్ర సముద్రంలో ఓ డ్రోన్ బోటును బాంబులతో పేల్చేశారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అమెరికా నేవీ తెలిపింది.  

గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ఇరాన్ మద్దతు పుష్కలంగా ఉన్న హౌతీ రెబల్స్ నవంబరు 19 నుంచి ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడిచేసి హైజాక్ చేస్తున్నారు. ఇది అంతర్జాయ రవాణాకు తీవ్ర ఆటంకం కలిగిస్తుండడంతో ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. హౌతీలు విరుచుకుపడుతుండడంతో చాలా కంపెనీలు ఎర్రసముద్రం గుండా రవాణాను నిలిపివేశాయి. బదులుగా ఆఫ్రికా చుట్టూ తిరిగి గమ్యాన్ని చేరుకుంటున్నాయి. దీనివల్ల ఆర్థికభారం పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, హౌతీ తిరుగుబాటుదారులు ఇప్పటి వరకు 25 నౌకలపై దాడులు చేశారు.

More Telugu News