అనుష్క సలహాలనే పాటిస్తున్నాను: ఆశ్రిత వేముగంటి
- 'బహుబలి 2' పాటలో మెరిసిన ఆశ్రిత వేముగంటి
- ఆ తరువాత పేరు తెచ్చిపెట్టిన 'యాత్ర' మూవీ
- నచ్చిన పాత్రలకే ఓకే చెబుతున్నానని వెల్లడి
- అనుష్క సూచనలనే పాటిస్తున్నట్టు వివరణ
తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశ్రిత వేముగంటి మాట్లాడుతూ, 'బాహుబలి 2' తరువాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు నచ్చినవి... చేసినవి చాలా తక్కువ. కొన్ని సినిమాల్లో నా పాత్ర గురించి చెప్పినదానికి .. తెరపై చూపించిన దానికి కాస్త తేడా కనిపించింది" అని అన్నారు.
గోపీచంద్ మలినేని గారు మాత్రం 'క్రాక్' సినిమా కోసం ఏదైతే చెప్పారో .. అలాగే చూపించారు. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. వ్యక్తిగతమైన .. వృత్తి పరమైన విషయాలను ఎలా బ్యాలెన్స్ చేయాలనే విషయంలో అనుష్క గారు నాకు ఇచ్చిన సలహాలనే నేను పాటిస్తూ వెళుతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.