YS Sharmila: కుటుంబాల మధ్య చిచ్చు గురించి జగన్ వ్యాఖ్యలపై షర్మిల స్పందన

Sharmila response on Jagan comments on rift between families
  • జగన్ ఏం మాట్లాడారో తనకు తెలియదన్న షర్మిల
  • కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
  • ఎక్కడ బాధ్యతలను అప్పగించినా పార్టీ విజయం కోసం పని చేస్తానన్న షర్మిల
కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేందుకు, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కాసేపటి క్రితం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.

 అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా... జగన్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ... కుటుంబంలో చిచ్చు గురించి జగన్ ఏం మాట్లాడారో తనకు తెలియదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ హైకమాండ్ తనకు ఇంకా బాధ్యతలను అప్పజెప్పలేదని... ఆంధ్ర అయినా, అండమాన్ అయినా ఎక్కడ బాధ్యతలను అప్పగించినా పార్టీ విజయం కోసం పని చేస్తానని చెప్పారు. తనకు అప్పగించే బాధ్యతలపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు.
YS Sharmila
Congress
Jagan
YSRCP

More Telugu News