ఇండియాలో 71 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం.. కారణం ఇదే!

WhatsApp bans 72 Lakh Indian users in November alone
  • గతేడాది నవంబరులో 71.96 లక్షల ఖాతాల బ్యాన్
  • యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు
  • ఫిర్యాదులు అందకున్నా 19 లక్షల ఖాతాలపై నిషేధం
మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో ఏకంగా 71.96 లక్షలమంది భారతీయుల ఖాతాలపై వేటేసింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన యూజర్ సేఫ్టీ రిపోర్టు పేర్కొంది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి వంటివాటిపై యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధించిన మొత్తం ఖాతాల్లో 19 లక్షల ఖాతాలపై ఫిర్యాదు అందకున్నా నిబంధనలు అతిక్రమించినందుకు గాను బ్యాన్ చేసినట్టు తెలిపింది. 

నవంబరు నెలలో యూజర్ల నుంచి మొత్తం 8,841 ఫిర్యాదులు అందినట్టు పేర్కొన్న వాట్సాప్ వాటిలో అత్యధిక ఫిర్యాదులు స్పామ్ ఖాతాలకు సంబంధించినవేనని తెలిపింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో యూజర్ సేఫ్టీ రిపోర్టు ఆధారంగా వాట్సాప్‌లోని ఏఐ (కృత్రిమ మేథ) ఆధారిత సాంకేతిక వ్యవస్థ ఆయా ఖాతాలపై చర్యలు తీసుకున్నట్టు వివరించింది.
Go Back to Shorts
WhatsApp
India
WhatsApp Ban
Meta

More Telugu News