ICU: పేషెంట్ నిరాకరిస్తే ఐసీయూలో చేర్చుకోవడానికి వీల్లేదు.. కేంద్రం ఆదేశాలు

  • ఐసీయూలో రోగులను చేర్చుకోవడంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
  • 24 మంది నిపుణుల బృందం రూపొందించిన మార్గదర్శకాల విడుదల
  • ఐసీయూలో చేర్చుకోవాల్సిన రోగులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
If the patient refuses he cannot be admitted to the ICU sasy guidelines issued by Central govt

రోగి నిరాకరిస్తే ఆసుపత్రి యాజమాన్యాలు ఐసీయూలో చేర్చుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. పేషెంట్ బంధువులు అభ్యంతరం తెలిపినా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు ఐసీయూలో రోగులను చేర్చుకోవడంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. 24 మంది నిపుణుల బృందం ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిపింది.

ఐసీయూ మార్గదర్శకాల్లోని కీలక పాయింట్లు ఇవే..
       

  • ఐసీయూ చికిత్స వద్దనుకునేవారు ‘లివింగ్‌ విల్‌’ను రాతపూర్వకంగా తెలియజేస్తే ఆ విభాగంలో చేర్చుకోకూడదు.
  • వ్యాధి లేదా అనారోగ్యంతో మరణం అంచులకు చేరినవారి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడే అవకాశం లేనప్పుడు వారిని ఐసీయూల్లో ఉంచడం ఉపయోగం లేదు.
  • ఐసీయూ కోసం ఎదురుచూస్తున్న రోగుల రక్తపోటు, శ్వాస రేటు, హృదయ స్పందన, శ్వాస తీరు, ఆక్సిజన్‌ శాచురేషన్‌, మూత్ర పరిమాణం, నాడీ వ్యవస్థ పనితీరు వంటి అంశాలను పరిశీలించి ఐసీయూలో చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకోవాలి.
  • గుండె లేదా శ్వాసకోశ వ్యవస్థ పనితీరులో సమస్యలు ఉన్న రోగులను ఐసీయూల్లో చేర్చుకోవడానికి కారణాలుగా పరిగణించాలి.
  • తీవ్ర అనారోగ్యం కారణంగా నిశిత పర్యవేక్షణ అవసరమైన రోగులు, అవయవ వైఫల్యం, ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశమున్న వ్యాధులతో బాధపడేవారిని ఐసీయూల్లో చేర్చుకోవాలి.
  • మహమ్మారులు, విపత్తుల సమయంలో వనరుల పరిమితి ఆధారంగా రోగులను ఐసీయూల్లో ఉంచే అంశంపై నిర్ణయం తీసుకోవాలి. 

More Telugu News