AP Anganwadis: అంగన్వాడీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

  • 22వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
  • ఈ నెల 5వ తేదీలోగా విధులకు హాజరు కావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు
  • విధులకు హాజరు కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
AP Govt serious warning to Anganwadis

తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరుకుంది. పలు రూపాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడిస్తూ వినతి పత్రాలను అందిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. మరోవైపు, విధుల్లో చేరాలని ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కూడా వారు పట్టించుకోలేదు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. 


ఈ క్రమంలో అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 5వ తేదీలోగా విధులకు హాజరు కావాలని అల్టిమేటం జారీ చేసింది. విధులకు హాజరుకాని వారిపై శాఖాపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది. జిల్లా కలెక్టర్ల నుంచి అంగన్వాడీలకు ఈ మేరకు నోటీసులు జారీ చేయించింది. ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో... అంగన్వాడీలు దిగివస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

More Telugu News