YS Sharmila: కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనంపై కీలక ప్రకటన చేయనున్న షర్మిల?

YS Sharmila to make key announcement on merging of YSRTP in Congress
  • పార్టీ కీలక నేతలతో భేటీ అయిన షర్మిల
  • కాంగ్రెస్ లో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • మధ్యాహ్నం 3 గంటలకు కడపకు బయల్దేరనున్న షర్మిల

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఎల్లుండి ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలను ఆమెకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ లో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణ తదితర కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 

ఇక ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మధ్నాహ్నం 3 గంటలకు షర్మిల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడపకు వెళ్లనున్నారు. కడప విమానాశ్రయం నుంచి ఆమె ఇడుపులపాయకు చేరుకుంటారు. తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా తండ్రి ఆశీర్వాదం తీసుకుంటారు. కాబోయే వధూవరులు రాజారెడ్డి, ప్రియ కూడా షర్మిలతో పాటు ఇడుపులపాయకు వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News