ఎమ్మెల్యే దానం నాగేందర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు
- తమ భూములు కబ్జా చేశాడంటూ ప్రకాశ్ నగర్ వాసుల ఆరోపణ
- ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీగా ప్రజాభవన్ కు వచ్చిన వైనం
- తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్
తమ భూమిలో కట్టుకున్న ఇళ్లను కూలగొట్టిస్తామని బెదిరిస్తున్నారంటూ బాధితులు కొందరు కన్నీటిపర్యంతమయ్యారు. ఎమ్మెల్యే దానం, ఆయన అనుచరుల ఆగడాల నుంచి కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాగా, మంగళవారం ప్రజావాణి సందర్భంగా బేగంపేట్ లోని ప్రజాభవన్ కు జనం పోటెత్తారు. సిటీ నలుమూలల నుంచి, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకుందామని వచ్చారు.