బాబ్బాబు.. అది దొరికితే ఇచ్చేద్దురూ!.. బ్యాగీ గ్రీన్ కోసం ఆసీస్ స్టార్ బ్యాటర్ వార్నర్ అభ్యర్థన
- ఫేర్‌వెల్ టెస్టు కోసం సిడ్నీ వెళ్తుండగా మాయమైన బ్యాగీ గ్రీన్
- కావాలంటే బ్యాక్‌ప్యాక్ ఇస్తానని స్పష్టీకరణ
- బ్యాగీ గ్రీన్ దొరికిన వారు సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదించాలన్న వార్నర్
అందులో వార్నర్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం తన బ్యాగీ గ్రీన్ ఉన్న లగేజ్ మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ వెళ్తున్న సమయంలో విమానాశ్రయంలో మాయమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. విమానయాన సంస్థ క్వాంటాస్‌ను అడిగితే తమ కెమెరాలు చెక్ చేశామని, బ్యాక్‌ప్యాక్ ఓపెన్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదని చెప్పారని పేర్కొన్నాడు. మీరు క్వాంటాస్ కోసం పనిచేస్తున్న వ్యక్తి అయినా, మరెవరైనా సరే బ్యాక్‌ప్యాక్ కావాలంటే తన వద్ద మరోటి ఉంది ఇస్తానని, కానీ ఆ బ్యాగీ గ్రీన్ కావాలని అభ్యర్థించాడు. తనను కానీ, క్రికెట్ ఆస్ట్రేలియాను కానీ సోషల్ మీడియా ద్వారా సంప్రదించి తన బ్యాగీ గ్రీన్ ఇస్తే తాను ఆ బ్యాక్‌ప్యాక్ ఇస్తానని చెప్పుకొచ్చాడు.
వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ తన దృష్టిని ఇప్పుడు టీ20 లీగ్‌లపై పెట్టాడు. అయితే, ఆసీస్ బోర్డు కావాలనుకుంటే మాత్రం 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు 161 వన్డేలు ఆడిన వార్నర్ 45.30 సగటుతో 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రేపటి నుంచి సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో మూడో టెస్టు ప్రారంభం అవుతుంది.