వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమితో మైదానంలోనే నిరుత్సాహపడ్డ కోహ్లీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఇదిగో!
- ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుండగా బాధతో కనిపించిన విరాట్
- సహచర ఆటగాళ్ల వైపు నడుస్తూ క్యాప్‌తో స్టంప్స్‌ను పడగొట్టిన కింగ్
- సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారిన ఫైనల్ నాటి వీడియో
టీమిండియా క్రికెట్ ఫ్యాన్‌గా అందరికీ సుపరిచితుడైన ‘ఎక్స్’ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ విచారంతో ఈ వీడియోలో కనిపించాడు. కప్ గెలిచిన ఆనందంలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా కోహ్లీ బాధతో తన సహచర ఆటగాళ్ల వైపు నడిచి వెళ్తూ క్యాప్‌తో స్టంప్‌లను పడగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది.