GST: డిసెంబరు మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలు ఇవిగో!

  • డిసెంబరులో రూ.1.65 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
  • నవంబరుతో పోల్చితే రెండు శాతం తక్కువ
  • నవంబరులో రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
December GST collections details

డిసెంబరు మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం నేడు విడుదల చేసింది. డిసెంబరులో మొత్తం రూ.1.65 లక్షల కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నవంబరు మాసంతో పోల్చితే డిసెంబరులో రెండు శాతం తక్కువ వసూళ్లు నమోదయ్యాయి. నవంబరులో రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అయితే, గతేడాది డిసెంబరుతో పోల్చితే 10 శాతం వృద్ధి నమోదైంది. ఏదేమైనా వరుసగా 10వ మాసం కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్ల మార్కు దాటింది. 

డిసెంబరు మాసం వసూళ్ల వివరాలు పరిశీలిస్తే... కేంద్ర జీఎస్టీ రూ.30,443 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు రూ.37,935 కోట్లు, సమీకృత జీఎస్టీ వసూళ్లు రూ.84,255 కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.41,534 కోట్లతో కలిపి), సెస్ రూ.12,249 కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.1,079 కోట్లతో కలిపి)... అని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది.

More Telugu News