మరో మూడు నెలల్లో మేమూ బటన్ నొక్కుతాం.. మీ అడ్రస్ గల్లంతవుతుంది: ఏపీ అంగన్వాడీలు
- 21వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె
- కొత్త సంవత్సరం రోజున రోడ్లపై కూర్చునేలా జగన్ చేశారని మండిపాటు
- ఎన్నికల సమయంలో మాకు హామీ ఇచ్చింది మీరు కాదా? అని ఆగ్రహం
తమరి మాటలను నమ్మి వైసీపీకి ఓట్లు వేస్తే... ఇప్పుడు తమను ఇలా ఇబ్బంది పెడతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి, తమకు న్యాయం చేయాలని అన్నారు. తమ వేతనాలు పెంచేలా జగన్ బటన్ నొక్కాలని... లేకపోతే మూడు నెలల్లో తాము బటన్ నొక్కుతామని, అప్పడు వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందని వారు హెచ్చరించారు.